ప్ర‌భుత్వ వైద్య విద్యారంగానికి మెద‌క్ మ‌రో మైలు రాయి : ఎమ్మెల్యే మైనంప‌ల్లి రోహిత్

by Ratna Kumari |

దిశ, మెదక్ ప్రతినిధి : ప్ర‌భుత్వ వైద్య విద్యారంగానికి మెద‌క్ మ‌రో మైలు రాయి అని ఎమ్మెల్యే డాక్ట‌ర్ మైనంప‌ల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. మెద‌క్ ప‌ట్ట‌ణంలోని పిల్లి కొట్యాల శివారులో ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌కు

ప్ర‌భుత్వ వైద్య విద్యారంగానికి మెద‌క్ మ‌రో మైలు రాయి : ఎమ్మెల్యే మైనంప‌ల్లి రోహిత్
X

దిశ, మెదక్ ప్రతినిధి : ప్ర‌భుత్వ వైద్య విద్యారంగానికి మెద‌క్ మ‌రో మైలు రాయి అని ఎమ్మెల్యే డాక్ట‌ర్ మైనంప‌ల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. మెద‌క్ ప‌ట్ట‌ణంలోని పిల్లి కొట్యాల శివారులో ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌కు 20 ఎక‌రాల్లో రూ.180 కోట్ల అంచ‌నాతో నిర్మిస్తున్న నూత‌న ప్ర‌భుత్వ క‌ళాశాల నిర్మాణానికి సోమ‌వారం ఎమ్మెల్యే మైనంప‌ల్లి రోహిత్ రావు శంకుస్థాప‌న చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ "ప్రభుత్వ ప్రాతి నిధ్యంతో, సమగ్ర వైద్య సదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నూతన వైద్య కళాశాలతో జిల్లా మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రాథమిక వైద్యంతో పాటు అత్యంత ప్రధానమైన వైద్య విద్యను అందించేలా మెడికల్ కళాశాలను రూపొందిస్తున్నామని వెల్ల‌డించారు. ప్రతిభ ఉన్న‌వారికి మెడికల్ విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. నూతనంగా నిర్మించనున్న వైద్య కళాశాల భవనాలు, అనుబంధ హాస్పిటల్ ఆధునాతన వైద్య సదుపాయాలతో నిర్మాణాలు చేప‌డుతామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ నితిన్ కాబ్రా, సూపర్డెంట్ సునీత, డీసీహెచ్ శివ దయాల్, ఎంసీఏ హెచ్ఓడి రాజశ్రీ ప‌లువురు ప్రొఫెస‌ర్లు పాల్గొన్నారు.

Next Story