ఆరెంజ్ జోన్ లో మెదక్ జిల్లా... కలెక్టర్ కీలక ఆదేశాలు

by velandi.Saikiran |

వర్షాల నేపథ్యంలో సింగూర్ నుంచి 43 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయడం జరిగిందని రాహుల్ రాజ్ తెలిపారు

ఆరెంజ్ జోన్ లో మెదక్ జిల్లా... కలెక్టర్ కీలక ఆదేశాలు
X

దిశ, కౌడిపల్లి : ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో సింగూర్ ప్రాజెక్ట్ నుంచి 43 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయడం జరిగిందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం కౌడి పల్లి మండలంలోని తునికి గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు. ఇటీవల కురుస్తున్న వర్షాల తో కూలిన ఇండ్లను పరిశీలించారు. తునికి చెరువును, పారుతున్న అలుగును నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డితో కలిసి పరిశీలించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. పురాతన ఇండ్లలో నివసించే వారిని ముందే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం ఏర్పాటు చేస్తామన్నారు. వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహించే సమయాల్లో ప్రయాణికులు వెళ్ళవద్దని సూచించారు. గడచిన 48 గంటల్లో జిల్లాలో అతి నుంచి అతి భారీ వర్షాలు కురిశాయని అన్నారు. కలెక్టర్ తో పాటు తహశీల్దార్ కృష్ణ, ఆర్ఐ శ్రీహరి, సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది ఉన్నారు.

Next Story