- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోకర్ణేశ్వర వీర హనుమాన్ దేవాలయంలో భారీ చోరీ
by Mallepaka Hamsa |
మండల కేంద్రమైన రేగోడ్ గోకర్ణేశ్వర, వీర హనుమాన్ ఆలయంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది.

X
దిశ, రేగోడ్: మండల కేంద్రమైన రేగోడ్ గోకర్ణేశ్వర, వీర హనుమాన్ ఆలయంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గురువారం ఉదయం ఆలయాన్ని తెరిచి పూజ చేసేందుకు పూజారి మహేష్ వెళ్లే సరికి తాళాలు పగలగొట్టి ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు.
వెంటనే భక్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా గోకర్ణేశ్వర, వీర హనుమాన్ సన్నిధిలోని రెండు హుండీలను దొంగలు పగలగొట్టి అందులోని సొమ్మును కాజేశారు. అదే విధంగా ఆలయంలోని అమ్మవారి మంగళసూత్రాలను కూడా దొంగలు తస్కరించినట్లు గుర్తించారు. హనుమాన్ జన్మోత్సవం జరగాల్సిన రోజే దొంగతనం జరగడం పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేశారు. ఈ చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






