- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతిచెందిన ఘటన చౌట్కూర్ మండల పరిధిలోని సుల్తాన్ పూర్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది.

X
దిశ, పెద్ద శంకరంపేట్: రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందిన ఘటన చౌట్కూర్ మండల పరిధిలోని సుల్తాన్ పూర్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని మూసాపేట్ గ్రామానికి చెందిన చిన్నయ్య గారి అక్షితా రెడ్డి(27), భర్త శ్రీనివాస్ రెడ్డి కులభ్ గూర్ లో కిరాణ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం జోగిపేటలోని బంధువుల ఇంటికి వారిద్దరూ హోండా ఆక్టివాపై బయలుదేరారు. ఈ క్రమంలో వారు సుల్తాన్ పూర్ వద్దకు రాగానే వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఆక్టివాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్షితారెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా, భర్తకు శ్రీనివాస్ రెడ్డికి స్వల్ప గాయాలు కాగా, చికిత్స నిమిత్తం అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతురాలు అక్షితారెడ్డికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Next Story






