టీఆర్ఎస్‌లో పలువురు చేరిక..

by Kodari Anjali |

ఇవాళ లింగంపేట మండలం అయ్యపల్లి గ్రామానికి చెందిన 30 మంది యువకులు శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

టీఆర్ఎస్‌లో పలువురు చేరిక..
X

దిశ, లింగంపేట: ఇవాళ లింగంపేట మండలం అయ్యపల్లి గ్రామానికి చెందిన 30 మంది యువకులు శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ ( తెలంగాణ రక్షణ సేన )పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్ వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. యూత్ నాయకులు సతీష్, వినయ్, జశ్వంత్, సుగుణాకర్, ప్రవీణ్, సాయి నికిల్ తో పాటు వివిధ పార్టీలకు చెందిన 30 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు సంపత్ గౌడ్ తెలిపారు. అనంతరం యూత్ అధ్యక్షుడిగా గోనె శేఖర్, ఉపాధ్యక్షుడుగా సున్నం రాకేష్‌లను నియమించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోకల సాయిరాం, జిల్లా కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు జైల్ సింగ్, మండల నాయకుడు, మహేందర్, మాలావత్ భరత్, సాయిలు పాల్గొనారు.

Next Story