- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంటల మార్పిడితో అధిక దిగుబడి: మండల వ్యవసాయ అధికారిని
ఒకే పంట సాగు చేయడంతో తక్కువ దిగుబడి వస్తుందని మండల వ్యవసాయ అధికారిని సారిక రెడ్డి రైతులకు సూచించారు.

దిశ, రాయికోడ్: ఒకే పంట సాగు చేయడంతో తక్కువ దిగుబడి వస్తుందని, పంట మార్పిడితో అధిక దిగుబడి పొందుతారని మండల వ్యవసాయ అధికారిని సారిక రెడ్డి రైతులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్ర పరిధిలోని కర్చెల్ గ్రామంలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సారిక రెడ్డి మాట్లాడుతూ... నేల ఆరోగ్య పరిరక్షణలో పచ్చి రొట్టె సాగు పాత్ర గూర్చి రైతులకు తెలిపారు. పంటలలో జీవన ఎరువుల ప్రాముఖ్యతను తెలియజేశారు. రైతులు మట్టి పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించాలని తద్వారా అధిక దిగుబడులు సాధించడంతో పాటు, సాగు పెట్టుబడులను తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. కార్యక్రమంలో పలువురు రైతులు వారికి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. మండల వ్యవసాయ అధికారిని సారిక రెడ్డి, గ్రామ సర్పంచ్ ఊర్మిళ, శ్రీనివాస్ రెడ్డి, ఏఈవో నవీన్, ఎటిఎం రమేష్, రైతులు ఉన్నారు.






