- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈనెల 24న మందకృష్ణ మాదిగ జహీరాబాద్ రాక
పెన్షన్ల పెంపును డిమాండ్ చేస్తూ ఈనెల 24న నిర్వహించనున్న సభకు ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ రానున్నట్లు MRPS

దిశ , జహీరాబాద్: వికలాంగులు, చేయూత దార్ల పెన్షన్ల పెంపును డిమాండ్ చేస్తూ ఈనెల 24న నిర్వహించనున్న సభకు ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రానున్నట్లు ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇంచార్జి ఉల్లాస్ మాదిగ పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సమావేశంలో ఎమ్మార్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు, సంగారెడ్డి జిల్లా ఇంచార్జి జలదానికి నర్సింగ్ రావు మాదిగ మాట్లాడుతు..వికలాంగులకు నెలకు రూ.4000 ఉన్న పెన్షన్ రూ.6000, అలాగే వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇతర చేయూత పెన్షన్ దారుల పెన్షన్ రూ.4000 పెంచుతామని ఇచ్చిన ఎన్నికల హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ రాయికోటి నరసింహులు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు , నేతలు జైరాజ్ మాదిగ, మైకల్ మాదిగ, రవికుమార్, నిర్మల్ మాదిగ, రాజు, మనోజ్, నగేష్, యేసప్ప, రాజేందర్, సింగితం రాజు, అబ్రహం మాదిగ తదితరులు పాల్గొన్నారు.






