ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి..

by Kodari Anjali |

ట్రాక్టర్ కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అల్లీపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి..
X

దిశ, చిన్నకోడూరు: ట్రాక్టర్ కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అల్లీపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నిమ్మకాయల రామస్వామి(40} తన సొంత ట్రాక్టర్‌తో రైతు పొలాల్లో వరిగడ్డిని కట్టలుగా కట్టేవాడు అన్నారు. గ్రామానికి చెందిన బోయ సురేష్ పొలంలో వరి గడ్డిని కట్టలు కట్టడానికి పోయి ఈ పొలంలో నుండి మరో పొలంలకు వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో రామస్వామి ట్రాక్టర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య రేణుక, కూతురు మహేశ్వరి, కుమారులు మహేందర్, శ్రీరాములు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story