- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, మిరుదొడ్డి : కల్వర్టు కోసం తీసిన గుంతలో పడి వ్యక్తి మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న బందెల రాజు (40) శ్రీగద గ్రామానికి వెళ్తున్నాడు. అక్బర్ పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి మరమ్మత్తులలో భాగంగా కల్వర్టు నిర్మాణం కోసం తీసిన గుంతలో ప్రమాదవశాత్తు పడిన రాజు దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రాజు కుటుంబ సభ్యులు, భార్యతో సహా ఆదివారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని భూంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్చరిక బోర్డులు లేకపోవడంతోనే తన భర్త గుంతలో పడి మరణించాడు అని, సదరు కాంట్రాక్ట్ కంపెనీ శ్రీ లక్ష్మీ ఇన్ఫ్రా ప్రాజెక్టు పై చట్ట రీత్యా చర్యలు తీసుకొని, తమకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు భూంపల్లి పోలీసులు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.






