మేడం టైం 3 గంటల వరకే... కానీ స్కూల్ మూసే సమయం 3:30 గంటలకు!

by Chintha Aamani |

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని దేగుల్ వాడి ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకే తాళం వేసి విద్యార్థులను ఇంటికి పంపించేశారు.

మేడం టైం 3 గంటల వరకే... కానీ స్కూల్ మూసే సమయం 3:30 గంటలకు!
X

దిశ, కంగ్టి: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని దేగుల్ వాడి ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకే తాళం వేసి విద్యార్థులను ఇంటికి పంపించేశారు. తరగతుల సమయం పూర్తి కాకముందే స్కూల్ మూసివేయడంపై తల్లిదండ్రులు , విద్యావేత్తలు , స్థానికులు ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది విద్యా హక్కును విస్మరించే చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనపై స్పందించిన స్కూల్ ఉపాధ్యాయుడు "దిశతో" మాట్లాడుతూ మా మేడం ప్రతి రోజు మూడుగంటలకే స్కూల్ నుంచి వెళ్తారు. అందుకే మేము 3:30 కి విద్యార్థులను పంపించేశాం అని వివరించారు. ఈ నేపథ్యంలో స్పందించిన మండల విద్యా అధికారి ఈ విషయమై పూర్తి వివరాలు సేకరిస్తాం. అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.

Next Story