చంద్రగ్రహణం ఎఫెక్ట్.. వనదుర్గమ్మ దర్శనం నిలిపివేత

by Batti.Sumithra |   (  Updated:2025-09-06 09:37:19  IST  )

ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గమ్మ దర్శనం నిలిపివేయనున్నారు.

చంద్రగ్రహణం ఎఫెక్ట్.. వనదుర్గమ్మ దర్శనం నిలిపివేత
X

దిశ, పాపన్నపేట : ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గమ్మ దర్శనం నిలిపివేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్, అర్చకులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వన దుర్గమ్మ దర్శనం కల్పించనున్నట్లు వారు వెల్లడించారు. సోమవారం ఉదయం 5:30 గంటలకు ఆలయ సంప్రోక్షణ అనంతరం వనదుర్గమ్మ దర్శనం యధావిధిగా కొనసాగుతుందని, ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని వారు పేర్కొన్నారు.

Next Story