మందుల కోసం పడిగాపులు

by Taduka Kalyani |

సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి రోగమంటూ వచ్చే వారికి ఇక్కడ తిప్పలు తప్పడం లేదు.

మందుల కోసం పడిగాపులు
X

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి రోగమంటూ వచ్చే వారికి ఇక్కడ తిప్పలు తప్పడం లేదు. డాక్టర్ల వద్ద పరీక్షలు చేయించుకోవడం ఒక వంతు అయితే. తిరిగి డాక్టర్లు రాసిన మందుల తీసుకోవడం కోసం క్యూలైన్లో పడిగాపులు కాయడం మరో వంతుగా మారింది. గంటల తరబడి ఉన్న అక్కడి కౌంటర్ వద్ద మందుల కోసం రోగులు, వారి బంధువులు నిలబడి అనేక అవస్థలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే జిల్లా ఆసుపత్రికి రోజూ వేల సంఖ్యలో ఇక్కడ పలు వైద్యం కోసం ప్రజలు వచ్చి వెళుతుంటారు. ఇంతమంది కోసం తక్కువ కౌంటర్ ను పెట్టడం, అక్కడ కూడా సరైన వసతులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోగుల కోసం ప్రత్యేకంగా అదనపు మందులు ఇచ్చే కౌంటర్లను ఏర్పాటు చేసి తగిన వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు.

Next Story