దసరా ధమాకా.. ఉమ్మడి మెదక్ జిల్లాలో జోరుగా మద్యం అమ్మకాలు

by Ajay Maddhiboyina |

దసరా పండుగ సందర్భంగా ఉమ్మ డి మెదక్ జిల్లాలో మద్యం అమ్మకాల జోరు కొనసాగింది. అక్టోబర్ 2న దసరా పండుగ జరిగిన విషయం తెలి సిందే.

దసరా ధమాకా.. ఉమ్మడి మెదక్ జిల్లాలో జోరుగా మద్యం అమ్మకాలు
X

దిశ, సంగారెడ్డి బ్యూరో: దసరా పండుగ సందర్భంగా ఉమ్మ డి మెదక్ జిల్లాలో మద్యం అమ్మకాల జోరు కొనసాగింది. అక్టోబర్ 2న దసరా పండుగ జరిగిన విషయం తెలి సిందే. ఆ రోజు గాంధీ జయంతి కావడంతో మద్యం దుకా ణాలు మూసివేశారు. అయితే, అంతకు ముందే అంటే సెప్టెంబరు 30, అక్టోబరు 1న, రెండు రోజుల్లోనే ఉమ్మడి జిల్లాలో రూ.32.97కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగడం విశేషం. ఇక సెప్టెంబర్ నెల మొత్తంలో అంటే 30 రోజుల్లో ఉమ్మడి జిల్లాలో రూ.260.26 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోల్చితే అమ్మకాలు పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.

నెలలో రూ.260.26 కోట్ల విలువైన లిక్కర్ సేల్..

ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 13 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. మెదక్ జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలు, సిద్దిపేట జిల్లాలో గజ్వేల్, సిద్దిపేట, మిరుదొడ్డి, చేర్యాల, హుస్నాబాద్ స్టేషన్లు ఉన్నాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో అక్క సెప్టెంబరు నెలలోనే రూ.129.08 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్క నెలలోనే రూ.260.26 కోట్ల మద్యం అమ్మారు. గత ఏడాది 2024 సెప్టెంబర్ ఉమ్మడి జిల్లాలో మొత్తం రూ.237.97 కోట్ల మద్యం విక్రయం జరిగింది.

రెండు రోజుల్లోనే రూ.32.97కోట్లు..

దసరా, గాంధీ జయంతి ఓకే రోజు రావడంతో మద్యం సేల్స్ పడిపోతాయని ఎక్సైజ్ అధికారులు భావించారు. అయితే గతంతో పోల్చితే అమ్మకాలు పెరగడం గమనార్హం. అక్టోబరు 2న గాందీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు మూసి వేశారు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 30, అక్టోబరు 1నే మద్యం అమ్మకాలు పెద్దఎత్తున జరిగాయి. సెప్టెంబర్ 30న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.23.31 కోట్ల మద్యం సేల్ అయ్యింది. అలాగే అక్టోబరు 1న కూడా రూ.9.66 కోట్ల మద్యం సేల్ అయ్యింది. ఈ రెండు రోజుల్లోనే రూ.32.97 కోట్ల సేల్ జరిగింది. రెండు రోజుల ముందే మద్యం ప్రియులు తమకు కావాల్సిన మద్యం తీసుకువెళ్లినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాగా, దసరా పండుగతో ఉమ్మడి జిల్లాలో 15శాతం మద్యం అమ్మకాల్లో పెరుగుదల ఉంటుందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇది ప్రతి ఏటా ఉండేదేనని, మిగతా రోజుల్లో ఎప్పటిలాగే అమ్మకాలు ఉంటాయని పేర్కొన్నారు.

Next Story