కేటీఆర్ భూ అక్ర‌మాల‌పై విచార‌ణ కోసం సీఎం కి లేఖ : INTUC జిల్లా అధ్య‌క్షుడు కొలుకూరు న‌ర‌సింహారెడ్డి

by Ratna Kumari |

దిశ, పటాన్ చెరు టౌన్ : అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ మంత్రి కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా టీఎస్ ఐఐసీ 110 ఎకరాల పరిశ్రమల భూములను ప్రైవేటు బిల్డర్లకు అక్రమ జీవోలతో 25 బహుళంతస్తుల

కేటీఆర్ భూ అక్ర‌మాల‌పై విచార‌ణ కోసం సీఎం కి లేఖ : INTUC జిల్లా అధ్య‌క్షుడు  కొలుకూరు న‌ర‌సింహారెడ్డి
X

దిశ, పటాన్ చెరు టౌన్ : అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ మంత్రి కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా టీఎస్ ఐఐసీ 110 ఎకరాల పరిశ్రమల భూములను ప్రైవేటు బిల్డర్లకు అక్రమ జీవోలతో 25 బహుళంతస్తుల నిర్మాణాల కొరకు 110 ఎకరాల వోల్టాస్ ర్యాల్ కేం భూములను ఇన్ కార్ అనే సంస్థకు అనుమతులు ఇవ్వడంతో కేటీఆర్ చట్టాలను పూర్తిగా తుంగలో తొక్కాడని, కాంగ్రెస్ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కోలుకూరు నరసింహ రెడ్డి ఆరోపించారు. శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 6 సంవత్సరాలుగా ఈ నిర్మాణ పర్మిషన్లు పొందిన పద్దతి అక్రమం అని అనేక శాఖలకు లేక ద్వారా తెలిపామని, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చిన 3 సంవత్సరాలకు ఎన్నికల ముందు టిఎస్ఐఐసి ఎన్ఓసి ఇవ్వడం వెనుక ఎవరున్నారని ఆరోపించారు. టిఎస్ఐఐసి ఎన్ఓసి ఇవ్వనిది హెచ్ఎండిఏ పర్మిషన్ ఎలా ఇస్తుంది ఆయన ప్రశ్నించారు. టీఎస్ఐఐసి కి రావలసిన 5 కోట్లకు పై బడిన రూపాయలను సంస్థ వద్దనే 3 సంవత్సరాలు అట్టి పెట్టుకున్నదని, రెవెన్యూ ఇతర రిజిస్టర్ శాఖలకు రావలసిన కోట్లాది రూపాయల ను అక్రమ పద్ధతిలో దారి మళ్లించడంతో రెవెన్యూ శాఖకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. రూ. 1000 కోట్ల భూముల వ్యవహారం పైన సీఎం రేవంత్ రెడ్డి గారికి విచారణ నిమిత్తం లేఖ రాయడం జరిగిందని, కేటీఆర్ అక్రమాలపై ముఖ్యమంత్రి చర్యకు ఆదేశించి, పూర్తి విచారణ జరిపితే కేటీఆర్ బాగోతం బయట పడుతుంది ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి మాజీ పీసీసీ కార్యదర్శి మతీన్ యువరాజ్ సింగ్, రాజు పాల్గొన్నారు.

Next Story