- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి : సీఐటీయూ
దిశ, జహీరాబాద్ : లేబర్ కోడ్స్ రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నోటిఫికేషన్ కాపీని దగ్దం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ

దిశ, జహీరాబాద్ : లేబర్ కోడ్స్ రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నోటిఫికేషన్ కాపీని దగ్దం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని పోరాటం ఆగదన్నారు. కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు మూకుమ్మడిగా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. 29 కార్మిక చట్టాల్ని రద్దు చేసి కార్పొరేట్లకు ఊడిగం చేసేందుకే లేబర్ కోడ్స్‌ను తీసుకొస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ ఎస్.మహిపాల్ , సీఐటీయూ వివిధ పరిశ్రమల యూనియన్స్, రంగాల నాయకులు నరేష్, మహేశ్వర్, సందీప్ రెడ్డి, శివ రామారావు, బాల్ రాజ్, భార్గవ్, సాయి కిరణ్ గౌడ్, శ్రీకాంత్, ఉమా, ఎల్లప్ప, సంజీవ్, గుండప్ప, కార్మికులు పాల్గొన్నారు.






