వేధింపులకు భయపడేది లేదు : కేటీఆర్

by Batti.Sumithra |

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, కాంగ్రెస్ పార్టీ కేసులతో వేధింపులకు దిగుతోందని ఆ వేధింపులకు భయపడేది లేదని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

వేధింపులకు భయపడేది లేదు : కేటీఆర్
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, కాంగ్రెస్ పార్టీ కేసులతో వేధింపులకు దిగుతోందని ఆ వేధింపులకు భయపడేది లేదని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం కంది సెంట్రల్ జైలులో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ నువ్వు ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంది సెంట్రల్ జైలుకు రావడం ఇది రెండోసారి అని, మొదటిసారిగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో గిరిజనులను అక్రమ కేసులతో అరెస్టు చేసినప్పుడు రావడం జరిగిందని, మరోసారి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నెక్రిశాంక్ పై అక్రమ కేసులతో జైల్లో ఉంచారని ఈ అక్రమ కేసులకు భయపడేది లేదు అంటూ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన క్రిశాంక్ పై 35 పైగా కేసులు నమోదు చేశారని స్టేషన్ బెల్ వచ్చే వాటిలో అరెస్టు చేసి జైల్లో బంధించాలని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచకాల పై ప్రశ్నించడమే ఆయన చేసిన తప్ప అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అల్లుడు ఆయన బావమరిది ఆయన కుటుంబ సభ్యులు చేసే అవినీతి పై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా పై చూపే శ్రద్ధలో ఒక్క పైసా అభివృద్ధి పై చూపిన అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో అనే పరువు, సిగ్గు లజ్జ ముఖ్యమంత్రికి లేవని తీవ్ర పదజాలంతో విమర్శించారు.

హామీలు అమలు చేసే వరకు పోరాటం ఆగదు..

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్ లను అమలు చేసే వరకు ఎంత వేధించిన ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆగదని కేటీఆర్ అన్నారు. పోలీసులు సీఎం ప్రైవేట్ ఆర్మీల పని చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ముఖ్యమంత్రి ప్రైవేటు ఆర్మీల పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బెంగళూరు నుండి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొని వచ్చి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను నాయకుల ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యక్ చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకీ ఇంత అనుభవిస్తావని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ , సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వివేకానంద గౌడ్, శంబిపూర్ రాజు పట్నం మాణిక్యం, కాసాల బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story