ఖేడ్ ఆర్టీసీ కండక్టర్ వసంత్ సస్పెండ్..

by Kodari Anjali |

రాయికోడ్‌‌లో జరిగిన ఆర్టీసీ ఘటనలో బాధ్యుడైన కండక్టర్‌ను సంస్థ సస్పెండ్ చేసినట్లు ఖేడ్ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు.

ఖేడ్ ఆర్టీసీ కండక్టర్ వసంత్ సస్పెండ్..
X

దిశ, నారాయణఖేడ్: రాయికోడ్‌‌లో జరిగిన ఆర్టీసీ ఘటనలో బాధ్యుడైన కండక్టర్‌ను సంస్థ సస్పెండ్ చేసినట్లు ఖేడ్ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. మే 1న మహాత్మ గాంధీ బస్టాండ్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న బస్సును రాయికోడ్ వద్ద తనిఖీ చేసిన టీటీఐ అధికారిపై బస్సు కండక్టర్ వసంత్ దాడికి పాల్పడిన విషయాన్ని ఆర్టీసీ సంస్థ పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా విచారించింది. ఈ ఘటనలో కండక్టర్‌ను దోషిగా పరిగణిస్తూ విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు.

Next Story