తెలంగాణ సంస్కృతికి కేసీఆర్ పెద్దపీట : వంటేరు ప్రతాప్ రెడ్డి

by Ratna Kumari |

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత లభించిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ సంస్కృతికి కేసీఆర్ పెద్దపీట : వంటేరు ప్రతాప్ రెడ్డి
X

దిశ, కొండపాక : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత లభించిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. గురువారం కుకునూర్ పల్లి మండల కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన బీరప్ప కామరాతి పండుగ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కరుమ సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికి, సంప్రదాయబద్ధంగా గొంగడి కప్పి సన్మానించారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వాన్ని, కుల వృత్తుల గౌరవాన్ని కాపాడటంలో గత ప్రభుత్వం కృషి చేసిందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ పిష్క అమరేందర్, మాజీ సర్పంచ్ బోడపట్ల ఐలం శివ, కురుమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Next Story