కేసీఆర్, హరీష్ రావు కీలక భేటీ.. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కొనసాగుతున్న చర్చలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-09-07 10:31:01  IST  )

సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో తెలంగాణ మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు

కేసీఆర్, హరీష్ రావు కీలక భేటీ.. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కొనసాగుతున్న చర్చలు
X

దిశ, ములుగు : సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో తెలంగాణ మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ క్షేత్రంలోని మూడవ అంతస్తులో ఈ భేటీ దాదాపు రెండు గంటలుగా కొనసాగుతుంది. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీయనుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత, హరీష్ రావుపై చేస్తున్న వ్యాఖ్యలు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికలపై నెలకొన్న వివాదం ఈ చర్చలో ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ భవిష్యత్ వ్యూహం, నాయకత్వం మధ్య ఉన్న విభేదాలు, ముందున్న స్థానిక ఎన్నికల పరిస్థితులు వంటి అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం.

అయితే సమావేశానికి బీఆర్ఎస్ ఇతర కీలక నేతలను అనుమతించకపోవడం విశేషంగా మారింది. ఈ సమావేశానికి ముఖ్యంగా కేటీఆర్ వారం రోజులుగా వ్యవసాయ క్షేత్రంలో ఉంటూ పలు రాజకీయ పరిణామాలను ఇక్కడి నుండే అనుసరిస్తున్నారు.bఈ సమావేశం అనంతరం అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడనప్పటికీ, పార్టీ లోపలి పరిణామాలపై ప్రభావం చూపే విధంగా నిర్ణయాలు తీసుకున్న అవకాశం ఉందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ భవిష్యత్తు నేతల మధ్య సమన్వయం, ప్రజలలో మళ్లీ విశ్వాసాన్ని పెంపొందించే రహస్య చర్చలు ఈ భేటీలో చోటుచేసుకున్నాయని తెలుస్తుంది. రాజకీయ వర్గాల్లో ఈ భేటీ ప్రాధాన్యతను బట్టి చూస్తే, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story