- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళేశ్వరం కేసులో న్యాయం గెలిచింది
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పును మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

దిశ, మెదక్ ప్రతినిధి : కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పును మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడం న్యాయం గెలిచినట్లేనని పేర్కొన్నారు. కమిషన్ విచారణలో ప్రాథమిక న్యాయ నిబంధనలు పాటించలేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా ఆ నివేదికకు చట్టపరమైన బలం లేదని తేలిందన్నారు. ముఖ్యంగా సెక్షన్ 8 కింద సంబంధిత వ్యక్తులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించడం అత్యంత కీలక పరిణామమని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై రాజకీయ ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కమిషన్‌లను అడ్డంపెట్టుకుని వేధింపులకు పాల్పడిందని విమర్శించారు. అయితే న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాడగా చివరకు నిజం గెలిచిందని అన్నారు.






