క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్న బాలిక‌కు జ‌గ్గారెడ్డి భ‌రోసా

by Ratna Kumari |   (  Updated:2026-04-06 14:26:02  IST  )

క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్న ఓ బాలిక‌కు అవ‌స‌ర‌మ‌య్యే ట్రీట్ మెంట్ ఖ‌ర్చు మొత్తం చెల్లిస్తాన‌ని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి భ‌రోసా ఇచ్చారు.

క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్న బాలిక‌కు జ‌గ్గారెడ్డి భ‌రోసా
X

దిశ, సంగారెడ్డి : "నాకు క్యాన్సర్ ఉంది. ఇప్పటివరకు మా దగ్గర ఉన్న డబ్బులతో ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఇక మా దగ్గర డబ్బులు లేక చికిత్స చేయించుకోలేకపోతున్నాను. నాకు బ్రతకాలని ఉంది దయచేసి నన్ను కాపాడండి" అంటూ జగ్గారెడ్డిని ఓ బాలిక వేడుకుంది. కన్నీటి పర్యంతమైన ఆ అమ్మాయి బాధను విన్న జగ్గారెడ్డి చ‌లించిపోయారు. ఆమె ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చులు మొత్తం తానే ఇస్తానంటూ జగ్గారెడ్డి హామీ ఇవ్వడంతో ఒక్కసారిగా ఆమె భారమైన మనసుతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణం జగ్గారెడ్డి నివాసం వద్ద చోటు చేసుకుంది.

జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అశ్విని అనే అమ్మాయి గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాదితో బాధపడుతోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కి ఆ అమ్మాయి తన తల్లితో కలిసి వచ్చి తన బాధను జగ్గారెడ్డికి చెప్పుకుంది. ఇప్పటివరకు దాదాపు రూ. 5 లక్షల రూపాయలు ఖర్చు చేశామని, ఇక తమ వద్ద డబ్బులు లేవని మరో రూ. 5 లక్షలు అయితే చికిత్స పూర్తవుతుందని తెలిపింది. ప్రస్తుతం అశ్వినీ ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు? ఇంకా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలని జగ్గారెడ్డి అడిగి తెలుసుకున్నారు. చికిత్స కోసం అయ్యే మిగతా డబ్బులు తాను ఇస్తానని, అధైర్య పడొద్దని జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. దీనికి ఆ అమ్మాయి, తన తల్లి ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story