క్యాన్స‌ర్ తో పోరాడే ఆరుగురికి జ‌గ్గారెడ్డి స‌హాయం

by Ratna Kumari |

దిశ‌, సంగారెడ్డి అర్భ‌న్ : క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆరుగురికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆర్థిక సహాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గు

క్యాన్స‌ర్ తో పోరాడే ఆరుగురికి జ‌గ్గారెడ్డి స‌హాయం
X

దిశ‌, సంగారెడ్డి అర్భ‌న్ : క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆరుగురికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆర్థిక సహాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గురువారం ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున తక్షణ సహాయాన్ని అందించారు. గతంలోనూ క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వారికి ఆయన సహాయాన్ని అందించారు. గుట్కా, సిగరెట్ తాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని, కుటుంబ సభ్యులను బాధ పెట్ట వద్దంటూ హితవు పలికారు. క్యాన్సర్ వ్యాధి బారిన పడడానికి అనేక కారణాలు ఉండవచ్చని, ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడిన వారి కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా చాలా రకాలుగా ఇబ్బందులకు గురవుతాయని అన్నారు. దురాలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యంగా జీవించాలని కోరారు.

Next Story