- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగ్గారెడ్డి దమ్ముంటే ఇంటి దొంగ పేరు బయటపెట్టు
దమ్ముంటే ఇంటి దొంగ పేరును బయట పెట్టాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సవాల్ విసిరారు.

దిశ, సంగారెడ్డి : బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందని విమర్శించే ముందు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత రాజకీయాలపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని, దమ్ముంటే ఇంటి దొంగ పేరును బయట పెట్టాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సవాల్ విసిరారు. మీనాక్షి నటరాజన్‌కు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నప్పటికీ, ఆమె నామినేషన్ ప్రక్రియను అడ్డుకునేలా సమాచారం ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులేనన్న ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కామాలు, ఫుల్‌స్టాప్‌ల వల్లే నామినేషన్ ఆగిపోయిందని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని విమర్శించారు. జాతీయ పార్టీ ఇంచార్జి స్థాయి నాయకురాలి అఫిడవిట్‌లో తప్పులు జరగడం కాంగ్రెస్ వైఫల్యమేనని అన్నారు. అలాగే, సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా చెప్పబడుతున్న వ్యక్తే మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడిచాడనే ఆరోపణలపై కాంగ్రెస్ ఎందుకు మౌనం పాటిస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలను దాచిపెట్టేందుకే బీఆర్ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. దొంగతనం చేసింది బీజేపీ వాళ్లు , బురద జల్లేది బిఆర్ఎస్ అని అడ్డుగోలు మాటలు మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్ మంత్రులే ఆధారాలతో సహా మీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులే సమాచారం ఇచ్చారని కుండబద్దలు కొడితే దానికి సమాధానం చెప్పే దమ్ము మీకు లేదు. హరీష్ రావు విమర్శలు ఊహాగానాలు కావు… ఆధారాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అంశాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు అని పేర్కొన్నారు.
హరీష్ రావు నిజాలు చెబితే ఎందుకు ఉలికిపాటు?
కాంగ్రెస్‌లోని కోవర్టుల వ్యవహారాన్ని బయటపెట్టినందుకే హరీష్ రావుపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. మీనాక్షి నటరాజన్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సిట్ విచారణకు ఆదేశించి నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మీనాక్షి నటరాజన్ కు ద్రోహం చేసింది ముఖ్యమంత్రి వర్గమే అని తెలిసిన మీరెందుకు మాట్లాడడం లేదు జగ్గారెడ్డి గారు …? మీ నోరు ఎవరు నొక్కేశారు. ముఖ్యమంత్రి కోసం రూ.100 కోట్లతో నిర్మిస్తున్న గెస్ట్ హౌస్, యూనిఫామ్ టెండర్లు, ప్రభుత్వ వ్యయాలు, హెలికాప్టర్ అద్దె ఖర్చులు* వంటి అంశాలపై హరీష్ రావు లేవనెత్తిన ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలని కోరారు. సంగారెడ్డిలో ప్రజల చేతిలో ఓటమి పాలైన జగ్గారెడ్డికి, ప్రజల గుండెల్లో ఉంటూ ఆరు సార్లు భారీ మెజారిటీతో గెలిచిన ప్రజా నాయకుడు హరీష్ రావుని విమర్శించే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి లాగా దొంగ హామీలిచ్చి , అబద్దాలు చెప్పి, ఢిల్లీ వాళ్ల కాళ్లు మొక్కి పదువులు తెచ్చుకుని అలవాటు మిది …? హరీశ్ రావు గారు ఎప్పుడు రైతులు, పేదల పక్షాన పోరాడుతూ ప్రజల మద్యనే ఉండే నాయకుడు. కానీ మీరు మాత్రం పదవి కోసం ఢిల్లీ నాయకుల చుట్టూ తిరుగుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రాపకం కోసం ఆరాటపడుతున్నారు. ఎవరైనా కోవర్టులు ఉంటే తోడ్కలు తీస్తామని జగ్గారెడ్డి గారు ప్రగల్భాలు పలుకుతున్నారు. మీకు నిజంగా అంత దమ్ముంటే , ముందుగా సీటు రాకుండా అడ్డుకున్న ఆ ముఖ్యమంత్రి అనుచరుడైన కోవర్టు పేరు బయటపెట్టండిని అన్నారు.






