- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మెదక్ > వృద్ధుల పట్ల చిన్నచూపు తగదు : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి సౌజన్య
వృద్ధుల పట్ల చిన్నచూపు తగదు : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి సౌజన్య
దిశ, సంగారెడ్డి అర్బన్ : వృద్ధుల పట్ల చిన్న చూపు తగదు అని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ,సీనియర్ సివిల్ జడ్జ్ బి సౌజన్య పేర్కొన్నారు.

X
దిశ, సంగారెడ్డి అర్బన్ : వృద్ధుల పట్ల చిన్న చూపు తగదు అని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ,సీనియర్ సివిల్ జడ్జ్ బి సౌజన్య పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలో గల గ్రేస్ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధుల పట్ల చిన్న చూపు చూడకుండా వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వారిని గౌరవంగా చూడాలని సూచించారు. అలాగే వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. వృద్ధులతో మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. న్యాయ పరమైన విషయాలలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, ఏదైనా న్యాయ సహాయం కోరినచో న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం, సంగారెడ్డిని సంప్రదించాలని సూచించారు. ఈ సందర్శనలో గ్రేస్ వృద్ధాశ్రమమం అధికారులు పాల్గొన్నారు.
Next Story






