సదాశివపేటలో ఐపీఎల్ బెట్టింగ్‌ల జాతర.. అప్పుల ఊబిలో యువత!

by Malleboina Mahesh |

సదాశివపేట మండలంలో ఐపీఎల్ బెట్టింగ్‌ల జోరు! లక్షల్లో చేతులు మారుతున్న నగదు. బైక్‌లు, బంగారం కుదవపెట్టి యువత అప్పుల పాలు. పోలీసులు స్పందించాలని డిమాండ్.

సదాశివపేటలో ఐపీఎల్ బెట్టింగ్‌ల జాతర.. అప్పుల ఊబిలో యువత!
X

దిశ, సదాశివపేట : మండలంలో ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు జోరుగా బెట్టింగ్ లు క్షణాల్లో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. యువత సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో బెట్టింగులకి అలవాటు పడి ఆర్ధికంగా చాలా నష్టపోతున్నారు. సాయంత్రం అయిందంటే చాలు 6 గంటల నుంచి రాత్రి 11 అయ్యే వరకు అడ్డాలుగా మారిన వివిధ షాపులలో గుంపులుగా కూర్చొని పందెం రాయుళ్లు బెట్టింగుల ఉచ్చులో పడుతున్నారు. ఫోన్లోనే టీమ్ ల వారీగా నువ్వెంత అంటే నేను ఇంతా అని మొదలుపెడతారు. ఈ బెట్టింగ్‌లు ఎలా అంటే రెండు టీమ్ లలో టాస్ తో మొదలై ఏ టీం గెలుస్తుందనే వరకు పందెం కాస్తున్నారు.

అంతే కాకుండా బంతి బంతికి బెట్టింగ్ ఆటగాళ్ల మీద కూడా పందెం నడుస్తుంది. ధోని, కోహ్లీ, ఇట్లా క్రేజీ ఉన్న ప్రతి ప్లేయర్ పై ఈ బెట్టింగులు సుమారు 1000 నుంచి మొదలుకొని ఒక్కొ వ్యక్తి రూ. 50 వేల వరకు మ్యాచ్ తీరుని బట్టి బెట్టింగ్ పెడుతున్నట్లు వినికిడి. కొంతమంది యువకులు బెట్టింగ్ ఆప్ లైన్, ఆన్ లైన్ లో అలవాటు పడి నష్టపోతున్నారనే సమాచారం. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో యువత మానసికంగా కుంగిపోయి వ్యాసనాలకు అలవాటు పడుతున్నారు.

మ్యాచ్ లు ఓడిపోయిన వారు అప్పులు తీసుకొని, మరికొందరు అయితే బంగారం, బైక్ లు సైతం కుదవ పెడుతూ రోడ్డున పడుతున్నారు. విచ్చలవిడిగా సాగుతున్న ఈ బెట్టింగుల వ్యవహారం సదాశివపేట మండలం సర్కిల్లలోనే అడ్డాలుగా ఏర్పరచుకొని కొన్ని చుట్టూ పక్క ప్రాంతాల్లో బెట్టింగులకి పాల్పడుతుండటంతో నిఘా లోపమా అనేది గమనార్హం.

అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడే వాళ్ళతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకొని ఈ అడ్డాలని ఆసరా గా వాడుకొని సంబంధించిన అధికారులే చూసి చూడనట్లు ఇలా వ్యవహరిస్తున్నారా..? అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంతమంది యువకులు మామూళ్ల రాయుళ్లు మాతో ఉన్నంత వరకు మాలాంటి పందెం రాయుళ్ళని అడిగేది ఎవరు అంటూ విచ్చలవిడిగా బెట్టింగులు నడిపిస్తున్నారు.

ఈ బెట్టింగ్ వ్యవహారాల్లో నెలసరి మామూళ్లకి అలవాటు పడిన వారు ఇలాంటివి చూసీ చూడనట్లు ఉంటున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారుల నిఘా లేకపోవడంతోనే పట్టణాలకే పరిమితం అని కాకుండా పల్లెల్లో కూడా ఈ బెట్టింగ్ దందా నడుస్తుంది. బెట్టింగులు చేస్తూ యువత రోడ్డున పడుతున్నారు. అధికారులు స్పందించకపోవడంతో యువత తల్లిదండ్రులు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బెట్టింగులు జరుగుతున్న ప్రాంతాల పై బెట్టింగ్ రాయుళ్ల పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Next Story