తొగుట విద్యార్ధులకు అంతర్జాతీయ గుర్తింపు

by Ratna Kumari |   (  Updated:2025-11-26 10:21:58  IST  )

దిశ, తొగుట : ఉత్తర అమెరికా తెలుగు సంఘ ప్రపంచ సాహిత్య వేదిక ప్రతిష్టాత్మకంగా నవంబర్ 30, 2025 ఆదివారం అంతర్జాలంలో ప్రతిష్టాత్మకంగా 13 గంటల పాటు బాలసాహిత్య భేరి పేరుతో

తొగుట విద్యార్ధులకు అంతర్జాతీయ గుర్తింపు
X

దిశ, తొగుట : ఉత్తర అమెరికా తెలుగు సంఘ ప్రపంచ సాహిత్య వేదిక ప్రతిష్టాత్మకంగా నవంబర్ 30, 2025 ఆదివారం అంతర్జాలంలో ప్రతిష్టాత్మకంగా 13 గంటల పాటు బాలసాహిత్య భేరి పేరుతో అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనం నిర్వహిస్తోంది. తొగుట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విష్ణువర్ధన్, చిక్కుడు రేఖ, అనిమెల్ల శ్రీనివాస్, అనిమెల్ల జస్వంత్ , చిక్కుడు ఓంకార్ ఎంపికయ్యారు. కథ, వచన కవిత్వం, గేయం, పద్యం విభాగాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు విద్యార్థిని, విద్యార్థులు 101 మంది కార్యక్రమంలో పాల్గొననున్నారు. విద్యార్థులు పద్య విభాగంలో ఎంపికై మూడు నిమిషాల పాటు తాము వ్రాసిన పద్యాలను వినిపిస్తారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ.ఉపేందర్ తెలిపారు. విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్లు, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, ప్రఖ్యాత బాల సాహితీవేత్తలు, జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొంటున్న ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో తమ పాఠశాల విద్యార్థులకు అరుదైన అవకాశం కల్పించిన తానా అధ్యక్షులు డాక్టర్ నరేన్ కొడాలి కి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ తోటకూర ప్రసాద్ కి, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ కి ధన్యవాదాలు తెలిపారు.

Next Story