- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ స్పోర్ట్స్ మీట్ షురూ
దిశ, సంగారెడ్డి : ప్రతిష్టాత్మకమైన ఐఐటి హైదరాబాద్ కు బ్యాడ్మింటన్ దిగ్గజాలు సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్ లు

దిశ, సంగారెడ్డి : ప్రతిష్టాత్మకమైన ఐఐటి హైదరాబాద్ కు బ్యాడ్మింటన్ దిగ్గజాలు సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్ లు విచ్చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఐఐటి హైదరాబాద్ వేదికగా ఇంటర్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని వారు హాజరై ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ మీట్ లో దేశంలోని అన్ని ఐఐటీలకు చెందిన 2500 మంది విద్యార్థులు పాల్గొని పోటీలో తమ ప్రతిభను కనబరచునున్నారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ స్పోర్ట్స్ మీట్ లో ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్ నిర్వహించనుండగా.. పోటీలో నెగ్గిన వారికి బహుమతులను ప్రదానం చేయనున్నారు.
అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకోండి : సైనా నెహ్వాల్
విద్యార్థులు అబ్దుల్ కలాం లాంటి మహనీయమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు సైనా నెహ్వాల్. స్పోర్ట్స్ మీట్ అనేది కేవలం కొన్ని రోజులకు పరిమితం కాకుండా రోజు ఉండేలా చూస్తే విద్యార్థులు ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా చదువులో బాగా రాణించే అవకాశం ఉందని ఆమె తెలిపారు. దేశం గర్వించదగ్గ పనులు చేసేలా యువత ముందుకు సాగాలని, నిత్యం స్పోర్ట్స్ ఆడుతూ శారీరిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం ఎంతో అవసరం అన్నారు. ఆరోగ్యవంతమైన పోషక ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం ఎప్పుడు దృఢంగా ఉంటుందన్నారు.






