- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెట్రోల్ ధరల పెంపు.. పేదల నడ్డి విరిచే చర్య
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు.

దిశ, సంగారెడ్డి అర్బన్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. సంగారెడ్డిలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్ ధరలు ఒకేసారి 3 రూపాయలు పెంచారు. 4 రాష్ట్రాల ఎన్నికల సమయంలో ధరలు పెంచలేదు. ఎన్నికలు అయిపోగానే వసూళ్లు మొదలు పెట్టారని అన్నారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు పెట్రోలియం శాఖ అధికారి చమురు ధరలు పెరగవని చెప్పారని, ఓటర్లను తప్పుదారి పట్టించి ఇప్పుడు రేట్లు పెంచారు అని మండిపడ్డారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు రేట్లు పెంచితే సామాన్యులు అర్థం చేసుకుంటారని,మరి ఈ రెండేళ్లలో అత్యంత తక్కువ ధరలో చమురు దొరికినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎందుకు ధరలు తగ్గించలేదు అని ప్రశ్నించారు. ఇది మధ్య తరగతి ప్రజలపై పెట్రోల్ భారం మోపడమే అని విమర్శించారు. బీజేపీ అనాలోచిత నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు.
బీజేపీ టార్గెట్ చిచ్చు పెట్టడం.. మా టార్గెట్ ప్రజల బాగు చేయడం
తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ టార్గెట్ అని, రాష్ట్ర ప్రజల బాగు కోసం పని చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ టార్గెట్ అని స్పష్టం చేశారు. హైల్ట్ పాలసీ కాలుష్య నివారణ కోసమే తెచ్చామని, సీఎం నేతృత్వంలో మంత్రులంతా ఒక్కతాటిపై పని చేస్తున్నామని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా ఈ సారి ధాన్యం మార్కెట్లోకి వచ్చిందిని. కొన్ని సందర్భాల్లో లారీలు లేట్ అయితే దాన్ని అదనుగా తీసుకుని ఆందోళనలు చేస్తున్నారని.. రైతుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. తరుగు పేరిట రైతులను మోసం చేసిన చరిత్ర వారిదని.. ప్రతి రెండు రోజులకు ఓ సారి ధాన్యం కొనుగోళ్లపై సీఎం సమీక్ష చేస్తున్నారని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది అని భరోసా ఇచ్చారు. చట్టాలను BRS చుట్టాలు చేసుకున్నట్టు తాము చేసుకోమని, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
నీట్.. నేషనల్ లీకేజ్ ఏజెన్సీ
నీట్ ఎగ్జామ్ నేషనల్ లీకేజ్ ఏజెన్సీగా మారింది. బీజేపీ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.






