- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొలానికి దారి విషయంలో.. సుఫారి గ్యాంగ్ తో హత్యకు ప్లాన్..!
దిశ, సిద్దిపేట ప్రతినిధి: పొలం దారి విషయంలో సుపారి గ్యాంగ్ తో హత్య కు ప్లాన్ చేసిన నిందితులు కటకటాల పాలైన సంఘటన సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి

దిశ, సిద్దిపేట ప్రతినిధి: పొలం దారి విషయంలో సుపారి గ్యాంగ్ తో హత్య కు ప్లాన్ చేసిన నిందితులు కటకటాల పాలైన సంఘటన సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..చిన్నగుండవెళ్లి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు పోలీస్ శ్రీనివాస్ రెడ్డి కి అదే గ్రామానికి చెందిన పుల్లగుర్ల యెల్లారెడ్డి తో పొలం వద్ద దారి విషయంలో భూ వివాదాలు జరుగుతున్నాయి. గ్రామంలో పంచాయితీలు జరిగినప్పటికీ సమస్య కోలిక్కి రాకపోవడంతో, శ్రీనివాస్ రెడ్డి యెల్లారెడ్డి ని చంపాలని నిర్ణయించుకుని, ఆ విషయాన్ని తన బంధువులు సాగర్, అతని స్నేహితుడు భరత్ కు చెప్పాడు. వారు ఇర్కోడుకు చెందిన పర్శరాములు ను అతనికి పరిచయం చేయడంతో, పర్శరాములు కు విడతల వారిగా రూ. 10 లక్షలను ఇచ్చాడు. ఈక్రమంలో హత్య చేయడానికి పర్శ రాములు తనకు పరిచయం ఉన్న ఫజిల్, కాస స్వామి లను సంప్రదించి, యోల్లారెడ్డిని కారు యాక్సిడెంట్ గా చూపించి చంపాలని చెప్పి వారికి 2 లక్షలను అందజేసాడు. ఈ విషయంలో అనిల్, అంజిబాబు, దుర్గాప్రసాద్, మల్లికార్జున్ వంటి డ్రైవర్లను కలుపుకున్నాడు. వారికీ ముందస్తుగా డబ్బులు చెల్లించి, కారు ను అద్దెకు తెప్పించి అక్టోబర్ 22వ తేదీన రాత్రి రెండు ప్రయత్నాలు చేసి విఫలమై, మూడవసారి యెల్లారెడ్డి బైకును వెనక నుండి గుద్దారు. కానీ యెల్లారెడ్డి బ్రతికి బయటపడడంతో, కారును అంజిబాబు ఇంట్లో దాచారు. తిరిగి శనివారం ఉదయం పర్శరాములు, స్వామి, ఫాజిల్, శ్రీనివాస్ రెడ్డి లు కలిసి మళ్లీ యెల్లారెడ్డి ని చంపే ప్లాన్ చేస్తుండగా.. పోలీసులు దాడి చేసి వారితో పాటు, అందులో సంబంధం ఉన్న జక్కుల దుర్గాప్రసాద్, చెంది అనిల్, పిల్లిట్ల అంజిబాబు, మేఘరాజు మల్లికార్జున్ లను అరెస్ట్ చేసారు. ఇర్కోడు కు చెందిన అనిల్, భరత్ లు పరారిలో ఉన్నారు. పట్టుబడ్డ వారి నుంచి 8 ఫోన్ల ను, మారుతి కారు ను స్వాదీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీను, ఎస్ఐ రాజేష్, సిబ్బంది రాజు, సుభాష్, విష్ణు, ప్రవీణ్, రాజు పాల్గొన్నారు.






