- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మెదక్ > సంగారెడ్డి జిల్లాలో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు: ఎస్పీ ఎం. రమణ కుమార్
సంగారెడ్డి జిల్లాలో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు: ఎస్పీ ఎం. రమణ కుమార్
by Taduka Kalyani |
జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నెల రోజుల పాటు అనగా మార్చి 1వ తేది నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ ఎం. రమణ కుమార్ మంగళవారం తెలిపారు.

X
దిశ, సంగారెడ్డి: జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నెల రోజుల పాటు అనగా మార్చి 1వ తేది నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ ఎం. రమణ కుమార్ మంగళవారం తెలిపారు. జిల్లాలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ప్రజా ధనానికి నష్టం కలగించడం, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదన్నారు.
జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఇట్టి విషయంలో పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
Next Story






