- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పారిశ్రామిక వాడల్లో అక్రమంగా వాటర్ తరలింపు
పారిశ్రామిక వాడలో నడుస్తున్న అక్రమ నీటి దందా. వాల్టా చట్టం ప్రకారం ఎలాంటి అనుమతులు లేకున్నా అక్రమార్కులు యథేచ్ఛగా నీటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.

పారిశ్రామిక వాడల్లో అక్రమంగా వాటర్ తరలింపు
=అసైన్డ్ భూముల్లో అక్రమ వ్యాపారం,
=ఉచిత విద్యుత్ వినియోగం
దిశ, జిన్నారం: అక్కడ తోడుకున్నోళ్లకు.. తోడు కున్నంత అక్రమ నీరు.. రాత్రి లేదు పగలు లేదు, ఇక అధికారులు తీరు అన్ని తెలిసినా అక్రమార్కులు ఇచ్చే అమ్యమ్యాలకు అలవాటు పడ్డారు. ప్రభుత్వ భూమి, పట్టా భూమి అని తేడా లేకుండా యథేచ్ఛగా నీటి దోపిడీ చేస్తున్నారు. ఈ తంతు గడిచిన 20ఏళ్ల నుంచి నడుస్తున్నా అడిగే నాధుడు లేదు. దీనితో కోట్ల రూపాయల ప్రభుత్వ రాబడికి చిల్లి పడుతోంది. ఇది జిన్నారం మండలం గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపల్ బొంతపల్లి పారిశ్రామిక వాడలో నడుస్తున్న అక్రమ నీటి దందా. వాల్టా చట్టం ప్రకారం ఎలాంటి అనుమతులు లేకున్నా అక్రమార్కులు యథేచ్ఛగా నీటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
పారిశ్రామిక వాడల్లోకి..
గడ్డపోతారం మున్సిపాలిటీలో ఖాజీపల్లి, గడ్డపోతారం, అల్లినగర్, కోర్లకుంట, గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి, వీరన్న గూడెం, దోమడుగు, గ్రామాలలో అక్రమ నీటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు గా కొనసాగుతోంది. పారిశ్రామిక వాడల్లో ఒక్కో ట్యాంక ర్ ధర రూ.3వేల వరకు ధర పలుకుతోంది. ఇక ఆర్వో ప్లాంట్ వీరు రూ.6వేల వరకూ విక్రయిస్తున్నారు. ప్రభు త్వ భూముల్లో బోర్లు వేస్తూ దానికి వ్యవసాయ కనెక్షన్ కింద ఉచిత విద్యుత్ ను వాడుతూ ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. అక్రమ నీటి వ్యాపారస్తులకు రెవెన్యూ అధికారులు పూర్తిగా సహకరిస్తుండడంతోనే ఈ వ్యాపారం కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. కిష్టయ్యపల్లి జిన్నారం ప్రధాన రహదారి పక్కనే భారీ గుంతలు తీసి వాటిని నీటిని నిల్వ పెట్టి స్థానిక పరిశ్రమలకు విక్రయిస్తున్నారు. స్థానిక నాయకులు ,ఆయా గ్రామస్తులు అక్రమ నీటి వ్యాపారంతో కోట్లు గడిస్తున్నారు.
అడుగంటుతున్న భూగర్భ జలాలు
ఎలాంటి అనుమతులు లేకుండా వేల ఫీట్ల లోతుకు బోర్లు వేసి, జనరేటర్లు ఉపయోగించి నీటిని బయటకు తీస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నా యి. దీంతో చుట్టుప్రక్కల ఉన్న వ్యవసాయ పొలా ల బోర్లు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నీటి వ్యాపారంతో అక్రమార్కులు కోట్లు గడుస్తుండగా రైతులు మాత్రం బోర్లు ఎండి నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. కాజిపల్లి, కొర్ల కుంట, కిష్టాయిపల్లి గ్రామ శివారులో అక్రమార్కులు ఏకంగా ప్రభుత్వ, అసైన్డ్, శిఖం భూముల్లో బోర్లు వేశారు. ఈ విషయం స్థానిక అధికారులకు తెలిసిన పట్టించుకున్న పాపాన పోలేదు. నిబంధనలకు విరు ద్ధంగా అక్రమనీటి వ్యాపారం చేస్తున్న వారిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.






