ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తే సస్పెండ్ చేస్తారా...?

by Naveena |

గవర్నర్ ప్రసంగంపై అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో నిలదీస్తుంటే అసెంబ్లీ నుండి సస్పెండ్ చేస్తారా అంటూ బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తే సస్పెండ్ చేస్తారా...?
X

దిశ, గజ్వేల్ రూరల్: గవర్నర్ ప్రసంగంపై అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో నిలదీస్తుంటే అసెంబ్లీ నుండి సస్పెండ్ చేస్తారా అంటూ బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాజీమంత్రి జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ సెషన్స్ నుండి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ.. శుక్రవారం గులాబీ శ్రేణులు వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, దానిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఆయనను అసెంబ్లీ సెషన్స్ నుండి సస్పెండ్ చేయడం చాలా సిగ్గుచేటని అన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని అన్నారు. భారత రాజ్యాంగంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కును రాజ్యాంగం కల్పించిందని తెలిపారు.

జగదీశ్వర్ రెడ్డి ఏం తప్పు చేశారని, ఎందుకు సస్పెండ్ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు లేక పంటలు ఎండిపోతా ఉంటే రైతులు 1000 కనులతో సాగునీరు కోసం ఎదురుచూస్తా ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం కనికరం లేకుండా చుక్క నీరును కూడా రైతులకు అందించకపోవడం చాలా బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించాల్సిన అభివృద్ధి సంక్షేమంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ. రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయొద్దిన్, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, మాజీ జెడ్పిటిసి పంగా మల్లేశం, మాజీ కౌన్సిలర్ గోపాల్ రెడ్డి నాయకులు గుంటుకు రాజు, గంగిశెట్టి రవీందర్, మరికంటి కనకయ్య, మామిడి శ్రీధర్, కొల్గూరు ఎంపీటీసీ గొడుగు జ్యోతి స్వామి, నాయకులు మాజీ సర్పంచ్ బయ్యారం శ్రీనివాస్ రెడ్డి, కటిక శీను, దయానంద రెడ్డి, కరీం, బీరయ్య, లతీఫ్, గజ్వేల్ మాజి కో ఆప్షన్ మెంబర్ అహ్మద్, తదితరులున్నారు.

Next Story