సేఫ్టీ నిబంధనలు పాటించకుంటే కుటుంబం రోడ్డు పాలు..

by Kodari Anjali |

సేఫ్టీ నిబంధనలు పాటించకుంటే కుటుంబం రోడ్డు మీద పడుతుందని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు.

సేఫ్టీ నిబంధనలు పాటించకుంటే కుటుంబం రోడ్డు పాలు..
X

దిశ, తూప్రాన్: సేఫ్టీ నిబంధనలు పాటించకుంటే కుటుంబం రోడ్డు మీద పడుతుందని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు. మీ ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయనే, అలాగే బంగారం ధర పెద్ద ఎత్తున పెరగడంతో చోరీలకు గురవడం జరుగుతుందని ప్రతి వ్యాపార వేత్తలు జాగ్రత్తగా ఉండాలని సీసీ కెమెరాలు అలెర్ట్ మెసేజ్‌లు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం నాడు తూప్రాన్‌లో బంగారం షాప్ వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి వ్యాపార వేత్తలు సీసీ కెమెరాలు అలెర్ట్ మెసేజ్‌లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని అన్నారు. గత మూడు రోజుల క్రితం కరీంనగర్ లో బంగారు ఆభరణాల దుకాణంలో పట్టపగలు దుండగులు చోరీకి గురవడం, ప్రతి ఒక్కరు గమనించారని, అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అలాగే రింగ్రోడ్ పై ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో అక్కడిక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ సేఫ్టీ నిబంధనలు పాటించకుంటే వారే నష్టపోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్ గౌడ్ సీఐ రంగకృష్ణ వెంకట్రాజా గౌడ్ జాన్ రెడ్డి, ఎస్సై గంగరాజు సుభాష్ గౌడ్ పోలీస్ సిబ్బంది బంగారం షాపుల యజమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Next Story