కేసీఆర్ గెలిస్తే అందరం బాగుపడతాం లేదంటే బాధపడతాం

by Disha Web Desk 22 |
కేసీఆర్ గెలిస్తే అందరం బాగుపడతాం లేదంటే బాధపడతాం
X

దిశ, వర్గల్: రైతులకు ఇచ్చిన అసైన్డ్ భూములకు వచ్చే ప్రభుత్వంలో సర్వ హక్కులు కల్పిస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదల భూములను గుంజూకుంటుందని ప్రతిపక్ష నాయకులు జూటా మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. నీళ్లు, ఇరవై నాలుగు గంటల కరెంటు, పేద ప్రజల కోసం వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చింది సీఎం కేసీఆర్ అని ప్రజలకు వివరించారు. మారుమూల గ్రామాలలో రోడ్లు వేసి అభివృద్ధి చేసింది సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే గ్రామాలలో కేసీఆర్ వేసిన రోడ్లకు గతుకులు వస్తే వాటిని గతుకలను డాంబర్ తో కూడా నింపరని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భూములకు విలువ పెరిగిందన్నారు. కేసీఆర్ ప్రజలకు మాట ఇస్తే ఇచ్చిన మాటను చేసి చూపిస్తారని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రూ. 600 పెన్షన్ మాత్రమే ఇస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రూ. 2వేల పెన్షన్ ఇస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ. 2వేల పెన్షన్ ఇస్తున్నారని ఈటల రాజేందర్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ రాక ముందు గజ్వేల్ ప్రాంతం ఎలా ఉందో, కేసీఆర్ గజ్వేల్ వచ్చిన తర్వాత గజ్వేల్ ప్రాంతం ఎలా ఉందో ప్రజలు గుండె మీద చేయి వేసుకొని ఒకసారి ఆలోచించాలన్నారు. ఎక్కడో ఉన్న గోదావరి జలాలను తీసుకువచ్చి కాళ్ళు కాడిగింది వాస్తవం కాదా అని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరువుతో పాటు కరెంట్ కష్టాలు వస్తాయన్నారు. దక్షిణ భారతదేశంలో ఏ సీఎం సాధించని రికార్డును, గజ్వేల్ నుంచి కేసీఆర్ భారీ మెజారిటీతో గెలుపొంది ముచ్చటగా మూడవసారి సీఎంగా రికార్డు సృష్టిచబోతున్నట్లు చెప్పారు.కాంగ్రెస్ కు ఓటు వేస్తే 3 గంటల కరెంటు వస్తుందని, బీఆర్ఏస్ కు ఓటు వేస్తే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ వస్తుందని ప్రజలకు సూచించారు. గజ్వేల్లో కేసీఆర్‌ను దీవించి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఏస్ మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, జెడ్పీటీసీ బాలమల్లు యాదవ్, ఎంపీపీ లత రమేష్, ఫ్యాక్స్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి, జిల్లా యువజన అధ్యక్షుడు దేవగానిక నాగరాజు, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు నాగరాజు, మాజీ అధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఉప్పరి కరుణాకర్, తదితరులు నాయకులు పాల్గొన్నారు.

Next Story