బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను పక్కన బెడితే ఉద్యమం చేపడుతాం : మాజీ మంత్రి హ‌రీశ్ రావు

by Ratna Kumari |

దిశ, నారాయణఖేడ్ : బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టు ను పక్కన పెడితే ఊరుకునేది లేదని, పనులు చేపట్టకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామ‌ని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను పక్కన బెడితే ఉద్యమం చేపడుతాం : మాజీ మంత్రి హ‌రీశ్ రావు
X

దిశ, నారాయణఖేడ్ : బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టు ను పక్కన పెడితే ఊరుకునేది లేదని, పనులు చేపట్టకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామ‌ని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం నారాయణఖేడ్ వచ్చిన సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. బసవేశ్వర ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని, సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుల కోసం బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామన్నారు. కాలేశ్వరం నీళ్లను బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఇవ్వాలని కేసీఆర్ బసవేశ్వర ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారన్నారు. సంగారెడ్డి జిల్లా అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారని, సంగమేశ్వర ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో ఉత్తంకుమార్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఖేడ్ నియోజకవర్గం వెళ్తే రెండు లారీల సోయాబిన్ కొంటే అందులో 60 క్వింటాళ్లను వాపస్ పంపించారని, ఖేడ్ లో అయినా రాష్ట్రంలో అయినా మక్కలు, సోయాబిన్ పంట కొని నెల రోజులు అయిపోయిందని. మక్క, సోయాబిన్ కు ఇప్పటిదాకా ప్రభుత్వం ఒక రూపాయి విడుదల చేయలేదని అన్నారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లో చెల్లింపులు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని, 48 రోజులు అయిపోయినా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రూపాయి కూడా రైతులకు చెల్లించలేదని అన్నారు.


ముల్లకర్ర పట్టి పొడిచినా ఈ ప్రభుత్వానికి చలనం లేదని, రాష్ట్రంలో సోయాబీన్ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ,కొనుగోలు చేయడం లేదని ,కొన్న పంటను కూడా వాపస్ పంపిస్తున్నారన్నారు. వెంటనే మక్క, సోయాబిన్ పంట కొనుగోలు చేసి రైతులకు చెల్లింపులు జరపాలని డిమాండ్ చేస్తున్నా మన్నారు. రెండుసార్లు రైతుబంధు ఇచ్చి రెండుసార్లు ఎగ కొట్టారని, పోయిన యాసంగి బోనస్ ఇంకా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. వెంటనే రూ.1150 కోట్లను యాసంగి బోనస్ కింద సన్న వడ్లకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సాగు చేసిన భూమికే రైతుబంధు ఇస్తామని చావు కబురు చల్లగా చెప్పిండు వ్యవసాయ మంత్రి తెలిపారు అన్నారు. మూడు పంటలకు రైతుబంధు ఇయ్యాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సాగుచేసిన భూమికే రైతు బంధు ఇస్తా అని మాట మార్చారన్నారు. 55 లక్షల ఎకరాల్లో పత్తి పంట పండుతుందని, 8 నెలలకు ఒకసారి పంట వస్తుందని, అంటే పత్తి రైతుకు సంవత్సరానికి ఒకసారి రైతుబంధు ఇస్తావా నీ విమర్శించారు. చెరుకు అనేది 11 నెలల పంట అని, చెరుకుకి ఒక్కసారే రైతుబంధు ఇస్తా అని ప్రభుత్వం అంటున్నదని తెలిపారు. పంట తోటలకు ఒక పంటకే ఇస్తావా? 7 లక్షల ఎకరాల్లో కందుల సాగు జరుగుతుందని, పసుపు, పత్తి, ఆయిల్ పామ్, పండ్ల తోటలకు ఒక సారి మాత్రమే రైతుబంధు ఇస్తానని ప్రభుత్వం చెబుతున్నదని అన్నారు. రైతులకు రైతుబంధు ఎగ్గొట్టే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఉన్నాడని తెలిపారు. ఇప్పటికే బోనస్ ఎగ్గొట్టిండని, పంటల బీమా ఎగగొట్టిండని, ఈ యాసంగిలో సాగు చేసిన వారికే రైతు బంధు అని ప్రభుత్వం చెబుతుంద‌న్నారు.

స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ని ఓడ‌గొడితేనే రెండు పంట‌ల‌కు రైతు బంధు వ‌స్తుంద‌ని.. 11సార్లు రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ కాదా..? అన్నారు. క‌రోనా వంటి కష్టకాలంలో కూడా రైతులకు రైతుబంధు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని తెలిపారు. 70 లక్షల ఎకరాలకు రైతుబంధు ఒకటే సారి ఇస్తామని ప్రభుత్వం అంటున్నదని, కేవలం వరికి మాత్రమే రైతుబంధు ఇస్తారా? ఇది ఎక్కడి న్యాయం అన్నారు. యాసంగిలో కోటి 46 లక్షల మందికి ఇస్తావా? లేదా సగం మందికి ఎగ్గొడతావా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక విధానం లేదా? కేసీఆర్ దేశంలో మొట్ట మొదటిసారి రైతుబంధు పథకాన్ని తెచ్చాడని అన్నారు. రైతులందరికీ రైతుబంధు సంవత్సరానికి రెండుసార్లు ఇచ్చాడని, కాంగ్రెస్ పార్టీని సర్పంచ్ ఎన్నికల్లో ఓడ కొట్టాలి లేకపోతే రైతుబంధు పోతుందని పేర్కొన్నారు. దేశంలో పత్తి దిగుబడి చాలా తగ్గిపోయింది పత్తి రైతులను ఆదుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ అందరికి భరోసా ఇచ్చిందని, కాంగ్రెస్ అవినీతికి భరోసా ఇచ్చిందని అన్నారు. రేవంత్ రెడ్డి చీరలు కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే చేస్తున్నాడు అని, కేవలం ఓట్లు ఉన్నాయని ఊర్లలో చీరలు పంచుతున్నారు. ఖేడ్ మున్సిపాలిటీలో ఓట్లు లేవని చీరలు పంచడం లేదని, కేసీఆర్ పండుగకు చీరలు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్లకు చీరలు ఇస్తున్నారు.


కోటి 30 లక్షల చీరలను ప్రతి బతుకమ్మకు కేసీఆర్ ఇచ్చాడని, ఈ ప్రభుత్వం ఇస్తుంది 50 లక్షల చీరలే అన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ. 2500 ఇస్తానని చెప్పావు. అది ఇస్తే మహిళలకు సారె పెట్టినట్టు, రెండేళ్లకు 60 వేల రూపాయలు ప్రతి మహిళకు బాకీపడ్డ రేవంత్ రెడ్డి ముందు అది చెల్లించి సారె పెట్టిన అని చెప్పారు. నారాయ‌ణఖేడ్ లో బీఆర్ఎస్ హయాంలో రోజూ మంచినీళ్లు వచ్చేది. ఇప్పుడు ఎందుకు రావడం లేదని, 100 కోట్ల రూపాయలను నారాయణఖేడ్ తండాలకు కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ డబ్బును రేవంత్ రెడ్డి ఇవ్వడం లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖేడ్ మొహిద్ ఖాన్, రాష్ట్ర గిడ్డంగుల మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం బిక్షపతి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కుమ్మరి పరమేశ్వర్, సంజీవరావు పటేల్, మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్ ,మాజీ జెడ్పిటిసి రవీందర్ నాయక్, గీతారెడ్డి పాల్గొన్నారు.

Next Story