- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. బావిలో పడి భార్యభర్తలు మృతి
బావిలో పడి భార్యాభర్తలు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా పాపన్న పేట మండలం నర్సింగిలో గురువారం ఉదయం జరిగింది. నార్సింగి కి చెందిన దారబోయిన నగేష్(34) స్వరూపలు శ్రీనివాస్ రెడ్డి వద్ద పశువుల కాపరులుగా

X
దిశ, మెదక్ ప్రతినిధి/ పాపన్న పేట : బావిలో పడి భార్యాభర్తలు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా పాపన్న పేట మండలం నర్సింగిలో గురువారం ఉదయం జరిగింది. నార్సింగి కి చెందిన దారబోయిన నగేష్(34) స్వరూపలు శ్రీనివాస్ రెడ్డి వద్ద పశువుల కాపరులుగా పని చేస్తున్నారు. ఉదయం వారు కానీ పించక పోవడంతో అనుమానంతో గాలించగా గ్రామ శివారులో ఒక బావి వద్ద చెప్పులు, మొబైల్ ఫోన్ లభ్యమయ్యాయి.. కొద్ది సేపటి తర్వాత భార్యాభర్తల మృతదేహాలు తేలాయి. అయితే మృతికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియలేదు. స్వరూప పడిపోతే నగేష్ కాపాడే ప్రయత్నం లో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. కాని వారి మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వారికి ఏడేళ్ల లోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు.
Next Story






