- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానవ సేవనే అభివృద్ధికి కేంద్ర బిందువు
సంకల్పంతో కూడుకున్న మానవసేవనే అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలుస్తోందని ప్రముఖ మానవతావాది, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ప్రకాష్ బాబా ఆమ్టే అన్నారు.

దిశ, సంగారెడ్డి : సంకల్పంతో కూడుకున్న మానవసేవనే అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలుస్తోందని ప్రముఖ మానవతావాది, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ప్రకాష్ బాబా ఆమ్టే అన్నారు. మంగళవారం కంది ఐఐటి హైదరాబాద్ లో 18వ స్థాపన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రకాష్ బాబా ఆమ్టే మాట్లాడుతూ చాలా తక్కువ సమయంలో ఐఐటీ హైదరాబాద్ సాధించిన అద్భుత అభివృద్ధిని చూసి సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా స్థిరత్వం, మానవ సేవ కోసం సాంకేతికతపై ఉన్న దృఢ నిబద్ధత ప్రేరణాత్మకంగా ఉంటుందన్నారు. విస్తృత స్థాయి వృక్షారోపణ, 6G, స్వయంచాలక వ్యవస్థల వంటి రంగాలలో పురోగతి, ప్రకృతితో విద్యార్థుల అనుబంధాన్ని పెంపొందించడం అభినందనీయమన్నారు. మానవ సేవే కేంద్ర బిందువుగా నిలుస్తుందని, ఈ దిశగా ఐఐటీ హైదరాబాద్ ముందుకు సాగడం ఆనందకరమని పేర్కొన్నారు.
గత 18 సంవత్సరాలలో, ఐఐటీ హైదరాబాద్ దేశంలో వేగంగా అభివృద్ధి చెందిన ప్రముఖ విద్యాసంస్థలలో ఒకటిగా ఎదిగి, బలమైన పరిశోధనా వ్యవస్థ, అంతరశాఖ అకడమిక్ నిర్మాణం, చురుకైన స్టార్ట్-అప్ సంస్కృతికి ప్రసిద్ధి చందడం విశేషం అన్నారు. కృత్రిమ మేధస్సు, ఆధునిక తయారీ, స్థిరత్వం, స్మార్ట్ మొబిలిటీ, భవిష్యత్ కమ్యూనికేషన్, ఆధునిక పదార్థ విశ్లేషణ, ఆరోగ్య సాంకేతికతల వంటి రంగాలలో ముందంజలో కొనసాగుతోందని చెప్పారు. అనంతరం ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ ఐఐటీ హైదరాబాద్ తన 18 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించే పరిశోధన, ఆవిష్కరణ, విద్యను సమన్వయం చేసిన సంస్థగా ఎదిగినందుకు గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తుకు సిద్ధమైన ప్రతిభను తీర్చిదిద్దడం, డీప్-టెక్ పరిశోధనను బలోపేతం చేయడం, దేశ అభివృద్ధికి తోడ్పడే ఆవిష్కరణ సంస్కృతిని పెంపొందించడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమీక్షించుకునీ భవిష్యత్ లక్ష్యాలను గుర్తుచేసుకునే సమయమని విద్యార్థులకు తెలియజేశారు. అందరికీ ఆదర్శమైన అబ్దుల్ కలాం చెప్పినట్లుగా "నిద్రపోనివ్వని కలలు కనాలి అని తెలిపారు.






