స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఒకరి మృతి

by Muthe.Rajitha |   (  Updated:2025-12-15 12:17:42  IST  )

రాష్ట్రంలో మరో భారీ ఫ్యాక్టరీ ప్రమాదం చోటు చేసుకుంది.

స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఒకరి మృతి
X

దిశ, వెబ్ డెస్క్/తుప్రాన్ : రాష్ట్రంలో మరో భారీ ఫ్యాక్టరీ ప్రమాదం చోటు చేసుకుంది. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం చెట్లగౌరారంలో ఉన్న ఎంఎస్‌ స్టీల్‌ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మేడ్చల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే ఘటనాస్థలికి వెళ్లేందుకు కార్మికుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా మృతుడికి, క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది.

Next Story