అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి : బండారు యాదగిరి

by Bhoopathi Nagaiah |

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని, దేశంలో మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలని TUWJ (IJU) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి డిమాండ్ చేశారు.

అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి : బండారు యాదగిరి
X

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని, దేశంలో మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలని TUWJ (IJU) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి డిమాండ్ చేశారు. మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేసి అక్రిడిటేషన్ జర్నలిస్టులకు రైల్వే పాస్‌లను పునరుద్ధరించాలని కోరారు. సోమవారం గాంధీ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన ఆయన అనంతరం మాట్లాడారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) పిలుపుమేరకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, పఠాన్ చెరు, ఆర్సీ పురం, అందోల్, కంది, గుమ్మడిదల తదితర ప్రాంతాల్లోని చాలా మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదన్నారు.

ఇప్పటికైనా జిల్లా ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ స్పందించి వెంటనే అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో గాంధీ విగ్రహాలకు వినతి పత్రం సమర్పించామని పిలుపునిచ్చారు. దేశంలోని పాలకవర్గాలు జర్నలిస్టుల హక్కులను హరించి వేస్తున్నాయని దుయ్యబట్టారు. పాత్రికేయులపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. ప్రభుత్వాలు పాత్రికేయుల రక్షణ కోసం చట్టాలు కట్టుదిట్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా యూనియన్ ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ సీనియర్ నాయకులు పానుగంటి కృష్ణ, అజిత్ కుమార్, జర్నలిస్టులు అశోక్ రెడ్డి, రాజు, దయానంద్, యాదగిరి అన్వర్, మసూద్ ఖాన్, హాజీ, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు.

Next Story