- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులందరికీ ఇళ్ల తాళాలు.. ఎవరు నిరాశ పడవద్దు : .ఎంపీ సురేష్ షెట్కార్
అర్హులందరికీ ఇళ్ల తాళాలు ఇస్తామని ఎవరు నిరాశ పడొద్దని ఎంపీ.సురేష్ షెట్కార్ అన్నారు.

దిశ , జహీరాబాద్ : అర్హులందరికీ ఇళ్ల తాళాలు ఇస్తామని ఎవరు నిరాశ పడొద్దని ఎంపీ.సురేష్ షెట్కార్ అన్నారు. గురువారం ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దారులకు ఇండ్ల తాళాలు అప్పగించారు. సందర్భంగా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో హోతి(కే)లో నిర్మించిన 660 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో 526 మందికి తాళాలు ఇచ్చేందుకు ఎంపిక చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు మాట్లాడుతూ..లాటరీలో ఎంపికైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలివ్వాలని కోరారు. చివరి నిమిషంలో కొందరిని అనర్హులుగా పేర్కొంటూ ఆపడం సరికాదని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ సందర్భంలో కొందరు లేచి వేదిక వైపు దూసుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
అనంతరం పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ మాట్లాడుతూ.. పేదలందరికీ తమ ప్రభుత్వం ఇండ్లు ఇస్తుందని ఎవరు నిరాశ చెందరాదన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరోపణలను ఖండిస్తూ.. లోగడ సిద్దిపేట ఎమ్మెల్యే మాజీమంత్రి హరీష్ రావు జహీరాబాద్ సొమ్మును దోచి సిద్దిపేటకు తరలించాడని ఆరోపించారు. అయినా రాజకీయాలకు ఇది వేదిక కాదని సంయమనం పాటించాలని కోరారు. విచారణ పూర్తి చేసి పెండింగ్లో పెట్టిన వారికి ఇండ్ల తాళాలు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం 524 మంది లబ్ధిదారులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐదు కౌంటర్ల ద్వారా ఇండ్ల తాళాలు తీసుకుని వెళ్లాలని సూచించారు. అందరికీ ఇస్తామని ప్రశాంతంగా ఉండాలని సూచించారు. సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ఎవరికీ అన్యాయం చేయమని, ప్రజలందరికీ ఇండ్లు అందజేస్తామన్నారు.
త్వరలో వారికి.. ఇండ్ల తాళాలు..
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో హోతి(కే)లో నిర్మించిన 660 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో 526 మందికి తాళాలు ఇచ్చేందుకు ఎంపిక చేశారు. మిగతా 134 మంది విచారణ అనంతరం వారంలోపు ఇవ్వనున్నట్లు ఆర్డీవో సమాచారంతో సెట్విన్ చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్య నగర్ కు చెందిన లబ్ధిదారు గడ్డం శ్రీలక్ష్మి లాటరీలో లబ్ధిదారునిగా ఎంపిక చేసిన అనంతరం మొత్తం ఇచ్చిన దృవపత్రం తో వచ్చింది. తనకెందుకు పెండింగ్లో పెట్టారని సభ మధ్యలో లేవడంతో కొద్ది సేపు గందరగోళం నెలకొంది. నేపథ్యంలో లక్ష్మి అనే మహిళను ఆమె భర్త, స్నేహితులు, మరికొందరిని పోలీసులు బయటకు పంపించే ప్రయత్నం చేశారు. అంతలోనే సీఐ శివలింగం, డీఎస్పీ.సైదులు కల్పించుకొని వారిని శాంతింపజేశారు.
ఆర్డీఓ రాంరెడ్డి, తాసిల్దార్ దశరథ్ లు వారితో మాట్లాడి ధ్రువపత్రాలను పరిశీలించారు. సత్వరమే విచారణ పూర్తి చేసి ఇళ్ల తాళాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్, ఫ్యాక్స్ చైర్మన్ మచ్చేందర్, పద్మ చైర్మన్ రామలింగారెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి , ఎంజీ.రాములు, కాజా మియా, మున్సిపల్ కమిషనర్ సుభాష్ రావు వివిధ శాఖల అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.






