గజ్వేల్ ఔటర్ పై ఘోర రోడ్డు ప్రమాదం

by Taduka Kalyani |

గజ్వేల్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

గజ్వేల్ ఔటర్ పై ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, గజ్వేల్ : గజ్వేల్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఆదివారం సాయంత్రం ప్రజ్ఞాపూర్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ బోడుప్పల్ కి చెందిన నలుగురు ఫోటోగ్రాఫర్లు సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఫోటోషూట్ కార్యక్రమానికి వచ్చారు. ఫోటో షూట్ నిర్వహించుకుని సిద్దిపేట నుంచి హైదరాబాద్ కి కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో ప్రజ్ఞాపూర్ లోని ఔటర్ రింగ్ రోడ్డుపై కారు అదుపుతప్పి డివైడర్ ని ఢీకొని హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళుతున్న లారీని బలంగా ఢీకొట్టగా స్పాట్ లోనే ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న గజ్వేల్ ఏసీపీ నర్సింలు స్థానిక పోలీసులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో పోస్టుమార్టం నిమిత్తం భద్రపరిచారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతిన్నది.

Next Story