పాఠశాల సామాగ్రి ధ్వంసం చేసిన ఆక‌తాయిలు

by Ratna Kumari |

దిశ, కొమురవెల్లి : కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిన్న పాఠశాలకు సె

పాఠశాల సామాగ్రి ధ్వంసం చేసిన ఆక‌తాయిలు
X

దిశ, కొమురవెల్లి : కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిన్న పాఠశాలకు సెలవు రోజు కావడంతో ఆకతాయిలు పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించి పాఠశాల యొక్క మరుగుదొడ్ల డోర్లు, ఎలెక్ట్రిసిటీ మీటర్ వైర్, తాగునీటి ట్యాప్ లు ఇతరత్ర సామాగ్రిని ధ్వంసం జరిగినందున సోమవారం కలెక్టర్ కె. హైమావతి పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాఠశాల సామాగ్రిని ధ్వంసం చేయడం ఎవరనే విషయాలను ప్రిన్సిపల్, ఉపాధ్యాయులతో కలిసి ఆరా తీశారు. తక్షణమే డ్యామేజ్ అయినవి అన్ని రిపేర్ చేయిస్తామని తెలిపారు. ధ్వంసం చేసిన వారిపై పోలీస్ కేసు నమోదు చేసి ఇలాంటి దుశ్చర్య కి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. మీకు ఎలాంటి ఆధారాలు దొరికినా పోలీస్ అధికారులకు తెలపాలని పాఠశాల అధికారులకు తెలిపారు. చుట్టు సిసి కెమెరా లు పెట్టించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అలాగే కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పాఠశాలకు సంబంధించిన ఎలెక్ట్రికిసిటీ కనెక్షన్, పర్నిచర్ ఇతరత్ర ఏ వస్తువు కూడా బయట ఉంచకుండా లోపల భద్రపరిచి తాళం వేసేలా ఉండాలని ప్రిన్సిపల్ కి సూచించారు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వారిపై క్రిమినల్ కేసులతో శిక్షిస్తామని తెలిపారు.

Next Story