గుండెపోటుతో హోమ్ గార్డ్ మృతి

by Naveena |

గుండె పోటుతో హోం గార్డు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

గుండెపోటుతో హోమ్ గార్డ్ మృతి
X

దిశ, మెదక్ ప్రతినిధి : గుండె పోటుతో హోం గార్డు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పాపన్న పేట మండలం నాగ్సన్ పల్లికి చెందిన మహేందర్ (32) మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ లో హోం గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళ వారం రాత్రి అస్వస్థతకు గిరి కావడంతో.. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందినట్లు తెలిపారు. గుండె పోటు వల్లే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. హోమ్ గార్డు మహేందర్ మృతితో సొంత గ్రామంలో విషాదం అలుముకుంది. మహేందర్ మృతితో కుటుంబీకులు బోరున విలపించాడు. హోమ్ గార్డు మృతి పట్ల జిల్లా పోలీస్ అధికారులు సంతాపం తెలిపారు.

Next Story