వసతి గృహంలో విద్యార్థుల నరకయాతన

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-01-01 15:50:40  IST  )

దిశ, నారాయణఖేడ్ : నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలో సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులు న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు.

వసతి గృహంలో విద్యార్థుల నరకయాతన
X

దిశ, నారాయణఖేడ్ : నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలో సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులు న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు. వ‌స‌తి గృహంలో మంచి విద్య‌తో పాటు పౌష్టికాహారం పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యార్థులకు మిస్ చార్జీలను పెంచి కామన్ మెనూను పెట్టడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషపడ్డారు. కానీ ఇందుకు భిన్నంగా సిర్గాపూర్ మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ వసతి గృహం ఉంది. అక్కడికి వార్డెన్ లేకపోవడంతో రాత్రి వేళలో విద్యార్థులు భయాందోళన గురవుతున్నారు. పురుగుల అన్నం, కుళ్లిపోయిన కూరగాయలతో అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. తక్కువ ధరకు కూరగాయలను కొనుగోలు చేసి పెట్టడంతో విద్యార్థులు అనారోగ్య పాలవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చెందారు. హాస్టల్ కు వార్డెన్ వచ్చినప్పుడు విద్యార్థులకు కొడుతున్నాడు న్నారు. ఎన్ని మార్లు మా తల్లిదండ్రులు వార్డెన్ కు చెప్పిన పట్టించుకోవడం లేదన్నారు. రోజు పురుగుల అన్నం కుళ్లిపోయిన కూరగాయలతో అన్నం పెడుతున్నారు. అనేకమార్లు పలుకు అన్నంతో వడ్డించి మాకు తినమని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.15 రోజుల నుంచి విద్యుత్తు సరఫరా లేకపోవడంతో అంధకారంలో ఉంటున్నామన్నారు. చదువుకోడానికి కూడా ఇబ్బందులు తప్పడం లేదన్నారు. బోరు మోటర్ చెడి పోవడంతో ఆరు బయటకు రాత్రి వేళలో కలకృత్యాలకు వెళుతున్నామన్నారు. హాస్టల్లో కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవన్నారు. హాస్టల్లో కిటికీలు లేకుండా చలికి వణికి పోతున్నామని అంటున్నారు. రోజు వార్డెన్ మద్యం తాగి వచ్చివిద్యార్థులకు కొడుతున్నారని సిర్గాపూర్-కడపల్ అడవిలో హాస్టల్ ఉండడంతో భయంతో గురవుతున్నామని.. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి వార్డెన్ డౌన్ డౌన్ అంటూ రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు.

Next Story