మెదక్ లో జల ప్రళయం..జనజీవనం అస్తవ్యస్తం

by velandi.Saikiran |

మెతుకు సీమ జల దిగ్బంధం లో చిక్కుకుంది. చరిత్రలో ఎన్నడు లేని రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షానికి జన జీవనం

మెదక్ లో జల ప్రళయం..జనజీవనం అస్తవ్యస్తం
X

దిశ, మెదక్ ప్రతినిధి: మెతుకు సీమ జల దిగ్బంధం లో చిక్కుకుంది. చరిత్రలో ఎన్నడు లేని రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షానికి జన జీవనం అస్తవ్యస్తంగా మారింది.. రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న గిరిజన తండా జలదిగ్బంధం లో చిక్కుకోగా.. డిగ్రీ కళాశాలలో 300 మంది విద్యార్థులను అధికారులు రక్షించారు.. చెరువు, వాగులు, కుంటలు వర్ష బీభత్సానికి కట్టలు తెంచుకొని విలయం సృష్టించి గ్రామాల రాకపోకలను నిలిచిపోయేలా చేసింది. మెదక్ జిల్లాలో చరిత్ర లో ఎన్నడు కురియని రికార్డు స్థాయిలో వర్షం కురింది. మెదక్, కామా రెడ్డి జిల్లాలో 20 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. దీనితో జిల్లా సరిహద్దులో ఉన్న ధూప్ సింగ్ తాండా జల దిగ్బంధం లో చిక్కింది. ఇళ్లలోకి నీళ్లు రావడం తో గిరిజనులు ప్రాణ భయం తో స్లాబ్ ల పైకి వెక్కి సహాయం కోసం గొంతెత్తి పరిస్థితి కలిగింది. బారీ వర్షాలకు నాగా పూర్ జాతీయ రహదారి పై రాకపోకలు నిలిపి వేశారు. నార్సింగ్ సమీపంలో రోడ్డు పై వర్షపు నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడం తో వాహనాల రాకపోకలు నిలిపి వేయడం తో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

రామాయంపేట డిగ్రీ కళాశాలలో 300 మంది విద్యార్థులు చిక్కుంటే అధికారులు తక్షణం స్పందించి తాడు సహాయం తో సురక్షితంగా తీసుకు వచ్చారు. హవేలీ ఘనపూర్ బీ తిమ్మాయిపల్లి చెరువు ఉదృతంగా పాటు గ్రామంలోకి చేరడం తో స్థానికులు సురక్షితంగా వేరే ప్రాణాలకు చేర్చారు. బ్యాతోల్ గ్రామానికి ఇరు వైపుల నీటి ప్రవాహం వల్ల ఊరు జలదిగ్బంధం లో చిక్కి వేరే ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి లేదు. నాగపూర్ నక్క వాగులో కారు అందరూ చూస్తుండగానే నీటిలో కొట్టుకు పోయింది. ఒడ్డున ఉన్న వారు వారించిన కారు నీటిలో నుంచి తీసే ప్రయత్నం చేశారు. అందులో ఉన్న వారు ఎవరు అనేది ఇంకా తెలియలేదు. వర్షం బీభత్సానికి నిజాంపేట లో పది వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. రామాయంపేట, మెదక్ పట్టణాల్లో పలు కాలనీల్లో నీరు రావడం తో అపార్ట్మెంట్ లో ఉండే వారు బయటకు రాలేని విధంగా నీరు ప్రవహిస్తుంది. జిల్లాలో ఉన్న చెరువులు, కుంటలు స్థాయికి మించి ప్రవేశిస్తుంది. హవేలీ ఘనపూర్ పెద్ద చెరువుకు గండి పడడం తో నీరు ప్రమాదకరంగా పారుతుంది. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. కొల్చారం మండలం తుక్కాపూర్ లో సమీపంలో మహిళా గల్లంతు అయింది. రేగోడ్ మార్పల్లి మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

ప్రమాదకరంగా పోచారం ప్రాజెక్ట్ ప్రవాహం..

రెండు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా పోచారం ప్రాజెక్ట్ కు భారీ స్థాయిలో నీరు రావడం మూలంగా ప్రాజెక్ట్ ఎత్తు కంటే అధికంగా నీరు ప్రవహిస్తుంది. డ్యామ్ పక్కన ఉన్న గట్టు పై నుంచి నీరు ప్రవహించడం పై స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగూర్ ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వస్తుండడం తో అధికారులు గేట్లు ఎత్తి నీటిని వదిలారు. కానీ భారీ స్థాయిలో సింగూర్ కు నీరు వస్తుండడం పై ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.

దూప్ సింగ్ గిరిజనులకు భరోసా

జలదిగ్బంధం లో చిక్కిన దూప్ సింగ్ తాండా గిరిజనులకు మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హనుమంతరావు భరోసా కల్పించారు. బుధవారం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు తో కలిసి జలదిగ్బంధం లో చిక్కిన దూప్ సింగ్ తాండా వరకు వెళ్ళారు. ఒడ్డున ఉంది ఫోన్ లో గిరిజనులతో మాట్లాడారు. సీఎం దృష్టికి విషయం తీసుకు వెళ్ళమని, అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. చాప్టర్ రావడం కు వాతావరం అనుకూలంగా లేకపోవడం వల్ల రావడం లేదని, ఇతర అధికారులు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వారికి భరోసా కల్పించారు.

నీట మునిగిన కాలనీల్లో ఎమ్మెల్యే పరిశీలన..

మెదక్ జిల్లా కేంద్రంలో భారీ వర్షానికి నీట మునిగిన కాలనీల్లో మెదక్ ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ పర్యటించి సహాయక చర్యలు అందించాలని అధికారులు ఆదేశించారు. భారీ వర్షాల వల్ల జలమేమైన ప్రాంతాల్లో త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు.

తక్షణ సహాయం అందించాలి : మాజీ ఎమ్మెల్యే

జలదిగ్బంధం లో చిక్కిన దూప్ సింగ్ తాండా వాసులకు తక్షణ సహాయం అందించి వారిని సురక్షితంగా తీసుకు రావాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గిరిజనులు ఆందోళన చెందుతున్నారని, వారిని వెంటనే కాపాడేందుకు హెలికాప్టర్ తీసుకు వచ్చి తీసుకు రావాలని ప్రభుత్వాన్ని కోరారు.

Next Story