- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరణించినా.. గెలిపించారు
దిశ, అందోల్/ రాయికొడ్ : స్థానిక ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు ఊహించని ఫలితానిచ్చారు. మరణించిన వ్యక్తిని సర్పంచ్‌గా

దిశ, అందోల్/ రాయికొడ్ : స్థానిక ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు ఊహించని ఫలితానిచ్చారు. మరణించిన వ్యక్తిని సర్పంచ్‌గా గెలిపించి వారికి అతని పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లాలోని రాయికొడ్ మండలం పిప్పడ్‌పల్లి గ్రామానికి చెందిన చాల్కి రాజు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రాజకీయాల్లో జరిగిన పరిణామాలతో తీవ్ర మనస్థాపానికి గురై ఈ నెల 6న అత్మహత్య చేసుకొని మృతి చెందాడు. దీంతో అతడు ఎన్నికల బరిలో ఉన్నట్టుగానే అధికారులు ప్రకటించారు. పిప్పడ్ పల్లి సర్పంచ్ అభ్యర్తులుగా చాల్కి రాజు (కాంగ్రెస్), నారాయణ (బీఆర్‌ఎస్) నాట్కరి రాజు (బీజేపీ) ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామంలో 1735 ఓట్లు ఉండగా.. 1463 మంది ఓటు హక్కును వినియోగించుకొగా, వీటిలో చాల్కి రాజుకు 699, నారాయణకు 690, నాట్కరి రాజుకు 74 ఓట్లు వచ్చాయి. దీంతో చాల్కి రాజు సమీప ప్రత్యర్థి బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారుడైన నారాయణపై 9 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. రాజు భౌతికంగా మరణించినా... ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా ఉన్నాడని, తన భర్తను గెలిపించిన గ్రామ ప్రజలందరికీ అతని భార్య శ్వేత ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు.






