- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండించిన ధాన్యం దొంగల పాలాయె
రైతులు చేసిన కష్టం చేతికి వస్తదో.. రాదో తెలీక దేవుళ్లను ప్రార్థించారు. తీరా పంట చేతికొచ్ఛేసరికి దొంగల పాలవుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

X
యావాపూర్ ఐకేపీ సెంటర్ లో ఘటన
దిశ, తూప్రాన్ : రైతులు చేసిన కష్టం చేతికి వస్తదో.. రాదో తెలీక దేవుళ్లను ప్రార్థించారు. తీరా పంట చేతికొచ్ఛేసరికి దొంగల పాలవుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. తూప్రాన్ మండల పరిధిలోని యావపూర్ గ్రామంలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రంలో గ్రామానికి చెందిన చాకలి స్వామి, పాక మల్లేష్ లకు చెందిన వడ్లను మంగళవారం రాత్రి ఎవరో గుర్తు తెలియని దుండగులు దొంగలించారు. రైతులు ఉదయం వచ్చి చూసే సరికి వడ్లు చోరికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 20 బస్తాల వడ్లు దొంగలు ఎట్టుకెళ్లినట్లు బాధిత రైతులు తెలిపారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆ రైతన్నలు వేడుకుంటున్నారు.
Also Read..
నకిలీ విత్తనాలు అమ్మితే.. పీడీ యాక్ట్ నమోదు చేస్తాం : ఎస్పీ ఎగ్గడి భాస్కర్
Next Story






