- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెంబర్తి ఇత్తడితో హరీశ్ రావు తండ్రి ఫొటో ఫ్రేమ్
దిశ, పటాన్ చెరు : ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు కు పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ యువత నాయకులు సాయిచరణ్ గౌడ్

X
దిశ, పటాన్ చెరు : ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు కు పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ యువత నాయకులు సాయిచరణ్ గౌడ్ ఘన నివాళి అర్పించారు. ఆదివారం హరీశ్ రావు ను కలిసిన సాయి చరణ్ గౌడ్ తెలంగాణ సాంప్రదాయ కళాకృతులకు ప్రసిద్ధి చెందిన పెంబర్తి ఇత్తడితో తయారు చేసిన ప్రత్యేక ఫోటో ఫ్రేమ్‌ను హరీశ్ రావుకు బహుకరించారు. ఈ అరుదైన గౌరవ నివాళిని అందుకున్న హరీశ్ రావు.. సాయిచరణ్ గౌడ్ చొరవను మెచ్చుకున్నారు. పెంబర్తి ఇత్తడి కళాకారుల చేతి వృత్తికి గుర్తింపు ఇవ్వడంతో పాటు తండ్రి జ్ఞాపకాలను శాశ్వతంగా ప్రత్యేక ఫోటో ఫ్రేమ్ తో అందించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.
Next Story






