మర్కుక్‌లో ఘనంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు

by Disha Web Desk 1 |
మర్కుక్‌లో ఘనంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు
X

దిశ, ములుగు : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో శనివారం మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా మర్కుక్ మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక రంగనాయక స్వామి ఆలయంలో అర్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రైతు వేదిక వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, ఎంపీపీ పాండు గౌడ్ మాట్లాడుతూ.. జన హృదయ నేత, తమ ఆత్మీయ నాయకుడు మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా వారు వారి కుటుంబం నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నామని తెలిపారు. మంచి హరీష్ రావు జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం చైర్మన్ హరి పంతులు, ఎంపీటీసీ పోరం అధ్యక్షుడు కృష్ణ యాదవ్, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు మ్యాకల కనకయ్య, రైతు సమన్వయ కో-ఆర్డినేటర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీటీసీలు చైతన్య శంకర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ ప్రవీణ్ చారి, ఆత్మ కమిటీ డైరెక్టర్ సంతోష్ రెడ్డి, అజయ్ రెడ్డి, సర్పంచ్ లు, మర్కుక్ మండల బీఆర్‌ఎస్ పార్టీ యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed