- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రౌండ్ బెస్ట్ లెర్నింగ్ ను విజయవంతం చేయాలి
గ్రౌండ్ బెస్ట్ లర్నింగ్ కార్యక్రమంను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.

దిశ, మెదక్ ప్రతినిధి : గ్రౌండ్ బెస్ట్ లర్నింగ్ కార్యక్రమంను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మెదక్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలోని ఎంపిక చేసిన 20 మంది విషయ నిపుణులకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం లపై జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాధికారితో కలిసి గ్రౌండ్ బెస్డ్ లర్నింగ్ కార్యక్రమం పై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను అర్థవంతంగా నిజజీవితంలో ఉపయోగించుకునే విధంగా తయారు చేయాలని,
ఆ దిశగా కంటెంట్ రూపొందించాలని, వివిధ పాఠశాలల నుండి ఎంపిక చేసిన విషయ నిపుణులకు సలహాలు సూచనలు ఇచ్చారు. ఆరు నుండి పదవ తరగతి వరకు తరగతుల వారీగా పైన తెలిపిన సబ్జెక్టుల వారీగా తయారు చేయాలని, తదుపరి జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలో అమలు చేయాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధా కిషన్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుదర్శన మూర్తి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, వివిధ పాఠశాల నుండి వచ్చిన విషయ నిపుణులు పాల్గొన్నారు.






